: మేం పోరాడింది ఎల్టీటీఈతోనే... తమిళులతో కాదు: రాజపక్స కొత్త పల్లవి


శ్రీలంకలో యుద్ధనేరాలపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై లంక అధినాయకత్వంపై దుమ్మెత్తిపోశాయి. తమిళ మైనారిటీలపై లంక సైన్యం దురాగతాలను అంతర్జాతీయ సమాజం కూడా తప్పుబట్టింది. ఆరోపణలన్నీ అభూతకల్పనలే అని లంకాధీశుడు మహింద రాజపక్స కొట్టిపారేయడమూ తెలిసిందే. ఇది కొన్నాళ్ళకిందటి మాట. తాజాగా, రాజపక్స కొత్త బాణీ ఆలపిస్తున్నారు. తాము పోరాడింది ఎల్టీటీఈతోనే తప్ప తమిళులతో కాదని స్పష్టం చేశారు.

తాము తమిళులపై యుద్ధం చేసినట్టయితే ఇప్పుడు దేశంలో తమిళులు సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. గాలే ప్రాంతంలో జరిగిన ఓ రాజకీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి సాయం అందుకుంటూ తమపై ఆరోపణలు చేస్తున్నాయని శ్రీలంక అధ్యక్షుడు దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News