: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గడవు పూర్తి
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈరోజు (గురువారం) మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. మార్చి 10వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఇవాళ్టితో పూర్తి అయింది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను శుక్రవారం నాడు పరిశీలిస్తారు. ఇక, అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 18వ తేదీ వరకు గడువుంది. అదే రోజున అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరుగుతుంది.