: ఆసీస్ జట్టుకు ఎదురుదెబ్బ!


ఇప్పటివరకు తమకు అందకుండా ఊరిస్తున్న టి20 వరల్డ్ కప్ ను ఈమారు ఎలాగైనా చేజిక్కించుకోవాలని భావిస్తున్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ! సూపర్ ఫామ్ లో ఉన్న లెఫ్టార్మ్ సీమర్ మిచెల్ జాన్సన్ కాలి బొటనవేలి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. దీంతో, ఈ యువ పేసర్ టి20 టోర్నీలో పాల్గొనేది అనుమానంగా మారింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తూ, ఈ సాయంత్రం జాన్సన్ విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొంది. ప్రస్తుతం జాన్సన్ కాలి బొటనవేలికి ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స తీసుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News