: సుజనా చౌదరి ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసిన అలీ
సినీ నటుడు అలీ టీడీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో ఉండే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు అలీకి టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.