: ప్రేమ కోసం పోలీసుగా ఫోజిచ్చి... జైలుపాలయ్యాడు!


ప్రేమ కోసమే ఆ యువకుడు పోలీస్ అయ్యాడు. కానీ, అతనేమీ పోలీస్ కాదు... కాకపోతే ప్రియురాలి కోసం పోలీస్ అవతారమెత్తిన అతనిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. సినిమాటిక్ గా జరిగిన ఈ ఘటన హైదరాబాదు సంజీవరెడ్డి నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. శ్రీకాంత్ ఎంబీఏ చదివి ప్రభుత్వోద్యోగం చేస్తున్నాడు. అయినా తాను ఇష్టపడిన అమ్మాయికి నచ్చలేదు. దాంతో పోలీస్ వేషంలో వెళితే ఆమె ఇంప్రెస్ అవుతుందనుకున్నాడు. అనుకున్నదే తడవుగా... పోలీసు గెటప్ లో బుల్లెట్ పై దర్జాగా బయల్దేరి ప్రియురాలి ముందు వాలిపోయాడు. పోలీస్ బాస్ నంటూ ఆమెకు కబుర్లు చెప్పాడు. ఇదంతా ఆమె నమ్మిందో లేదో గానీ, ఎర్రగడ్డలో ఈ నకిలీ పోలీసును చూసిన అసలు పోలీసులు మాత్రం అనుమానంగా చూశారు. ఈ ‘పోలీసు బాస్’ని పీఎస్ కు తీసుకెళ్లి ప్రశ్నిస్తే విషయం బయటపడింది. దాంతో అతగాడిని అరెస్ట్ చేసిన ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News