: అనుచరులతో గంటా మంతనాలు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరులతో మంతనాలు సాగిస్తున్నారు. తాజాగా టీడీపీలోకి మారిన గంటా ఈ ఉదయం విశాఖలో పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయనపై అయ్యన్నపాత్రుడు నేరుగా విమర్శనాస్త్రాలు సంధించడంతో గంటా మనస్తాపం చెందారు. దీనిపై తన అనుచరులతో తీవ్రంగా చర్చిస్తున్నారు. చింతకాయలతో గంటాకు విభేదాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం.
గతంలో వీరిద్దరూ టీడీపీలో ఉండగా ప్రారంభమైన విభేదాలు గంటా కాంగ్రెస్ లోకి చేరి విజయపథాన సాగిపోతుండడంతో పెరిగి పెద్దవయ్యాయని, ఇప్పుడవి మరింత తీవ్రమయ్యాయని విశాఖ జిల్లావాసుల కథనం. సాక్షాత్తూ పార్టీ అధినేత వద్దే విమర్శలకు దిగడంతో వీరి మధ్య అగాధం మరింత పెరిగిపోయిందని సమాచారం.