: భారత్ ను చూసి ఇక భయపడేది లేదట!


పాకిస్తాన్ క్రికెట్ జట్టు కయ్యానికి కాలుదువ్వుతోంది. భారత జట్టును చూసి భయపడే రోజులు పోయాయని పాక్ టి20 జట్టు కెప్టెన్ మహ్మద్ హఫీజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరదీశాడు. ఇటీవలే టీమిండియాను ఆసియా కప్ లో చిత్తు చేశామని, టి20 వరల్డ్ కప్ లోనూ అదే ఒరవడి కొనసాగిస్తామని హఫీజ్ ధీమా వ్యక్తం చేశాడు. లాహోర్లో మీడియాతో మాట్లాడుతూ 'భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్నదే. టి20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ భారత్ తో ఆడాల్సి రావడాన్ని ఓ కెప్టెన్ గా స్వాగతిస్తా. అల్లా దయతో ఆ మ్యాచ్ లో నెగ్గి, అదే ఊపుతో మిగతా మ్యాచ్ లు గెలిచేందుకు ప్రయత్నిస్తాం' అని హఫీజ్ పేర్కొన్నాడు.

కాగా, ఈ టోర్నీ బంగ్లాదేశ్ లో ఈ నెల 16న ఆరంభం కానుంది. కాగా, దాయాదులు ఈ నెల 21న అమీతుమీ తేల్చుకోనున్నారు. నేడు బంగ్లాదేశ్ పయనం కానున్న పాక్ జట్టు మార్చి 17న న్యూజిలాండ్ తో, ఆ మరుసటి రోజు దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది.

  • Loading...

More Telugu News