: ఫేస్ బుక్ లో వైఎస్సార్సీపీకి ఫాలోయింగ్ ఎక్కువే!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో ఫాలోయింగ్ బాగానే కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ఫేస్ బుక్ పేజీ సుమారు మూడు లక్షల లైక్స్ ను సంపాదించుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ ఫాలోయింగ్ లో పోటీపడుతోంది. టీడీపీకి 2.91 లక్షల లైక్స్ ఉన్నాయి. లోక్ సత్తా పార్టీ 1.15 లక్షల లైక్స్ దక్కించుకుంది. మిగిలిన రాష్ట్రాల్లో సంగతి చూస్తే ఎన్సీపీ ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉంది. ఆ పార్టీ రెండు లక్షలకు పైగానే లైక్స్ సంపాదించింది. యూపీలోని సమాజ్ వాది పార్టీ 68 వేల లైక్స్ ను అధిగమించింది. బీఎస్పీ, జేడీఎస్, ఆర్ఎల్డీ పార్టీలకు లైక్స్ రెండు వేల వరకు ఉన్నాయి. ఇక ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు అత్యల్ప లైక్స్ ఉన్నాయి.