: రాష్ట్ర రాజకీయాలకు ఈ ఎన్నికలు కీలకమైనవి: రాఘవులు


రాష్ట్ర రాజకీయాల్లో ఈసారి జరుగనున్న ఎన్నికలు కీలకమైనవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని మగ్దూం భవన్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని అన్నారు. రాష్ట్రంలో పోటీచేసే పార్టీలు ఎక్కువయ్యాయని, అందుకే ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది అంచనా వేయడం కష్టంగా మారిందని, ప్రజలనాడి కనుక్కునేందుకు ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నిలదొక్కుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దానికి టీడీపీ వత్తాసు పలుకుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో జరిగినవన్నీ మర్చిపోయిన చంద్రబాబు మరోసారి బీజేపీతో అంటకాగేందుకు సిద్ధమవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీల పొత్తు రాష్ట్ర రాజకీయాలకే ప్రమాదకరం అని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కలసిరాని పార్టీలతో పొత్తుకు సిద్ధమని రాఘవులు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల తరువాత పొత్తుల గురించి ఆలోచిద్దామని అంతవరకు మున్సిపల్ ఎన్నికలకు సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News