: కెనరా బ్యాంక్ ప్రచారకర్తగా క్రికెటర్ శిఖర్ ధావన్
ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ను ప్రభుత్వరంగంలోని కెనరాబ్యాంకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. ఈ సందర్భంగా ధావన్ మాట్లాడుతూ.. కెనరాబ్యాంకుతో కలసి పనిచేయడం గౌవరంగా భావిస్తానన్నాడు. 'ధావన్ క్రికెట్ లో కొత్తదనాన్ని చూపుతుంటారు. కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంటారు. అలాగే, కెనరా బ్యాంకు కూడా బ్యాంకింగ్ రంగంలో కొత్తదనం కోసం పనిచేస్తుంటుంది. ఈ నేపథ్యంలో ధావన్ ను మా ప్రచారకర్తగా నియమించుకున్నాం' అని కెనరాబ్యాంకు ఎండీ దూబే తెలిపారు. అత్యాధునిక బ్యాంకింగ్ సేవలను ధావన్ తో ప్రచారం చేయడం ద్వారా యువ కస్టమర్లను ఆకర్షించాలని కెనరాబ్యాంకు ప్రయత్నం.