: ఎన్నికలపై కన్నేసిన బుకీలు
మునుపెన్నడూలేని రీతిలో దేశం ఎన్నికలకు సమాయత్తమవుతోంది. యూపీఏ పాలనకు చరమగీతం పాడాలని బీజేపీ, కాషాయదళం దూకుడుకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్, సంకీర్ణం ఖాయమంటూ ఇంకా ఊపిరి పోసుకోని థర్డ్ ఫ్రంట్ బరిలో దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఉత్కంఠను సొమ్ము చేసుకునేందుకు పేరుమోసిన బుకీలు రంగంలోకి దిగారు. భారత్ లో పోలీసుల భయంతో వారు నేపాల్ నుంచి కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొందరు బుకీలు నేపాల్ లో సమావేశమయ్యారు.