: రేపు టీడీపీలో చేరనున్న శత్రుచర్ల
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీన పడుతోంది. సైకిలెక్కడానికి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు సైకిల్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు కురుపాం ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజు కూడా టీడీపీలో చేరనున్నారు. రేపు చంద్రబాబు సమక్షంలో వీరిద్దరూ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.