: ఐదు వేల ఆటోలతో 'మోడీ నైట్'
ఎన్నికలు తరుముకొస్తుండడంతో బీజేపీ వినూత్న ప్రచారానికి తెరదీసింది. ఈ వారాంతంలో 5,000 ఆటోలతో ఢిల్లీ నగర వీధుల్లో 'మోడీ రాత్' (మోడీ నైట్) పేరిట భారీ ఎత్తున ప్రచార ర్యాలీ నిర్వహించాలని ఢిల్లీ బీజేపీ శాఖ నిర్ణయించింది. పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతుగా ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆటోను మోడీ కటౌట్, పార్టీ చిహ్నం, అక్కడ పోటీ చేసే లోక్ సభ అభ్యర్థి ముఖచిత్రంతో అలంకరిస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరామని ఢిల్లీ బీజేపీ రవాణా విభాగం అధ్యక్షుడు ఆనంద్ త్రివేది తెలిపారు. ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఆటో ర్యాలీ ఉంటుందని తెలిపారు.