: వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 'స్థానిక' చిచ్చు


త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు వైఎస్సార్సీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చిచ్చు రాజేశాయి. అభ్యర్థుల విషయంలో సీనియర్ నేతలు వంగవీటి రాధాకృష్ణ, గౌతమ్ రెడ్డిల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. 21వ డివిజన్ లో పార్టీ తరపున పోటీచేసేందుకు తమ వర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని ఇరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. దాంతో, ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో, పార్టీ పరిశీలకుడిగా వచ్చిన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు ముందు తన చేతిలో ఉన్న బిఫారాలను రాధా విసిరేశారు. అక్కడున్నవారు జోక్యం చేసుకోవడంతో కొద్దిసేపటికి వ్యవహారం సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News