: ఈ రోజు, రేపు తెలంగాణ... ఎల్లుండి ఆంధ్రప్రదేశ్: డిగ్గీరాజా షెడ్యూల్


ఈ రోజు, రేపు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతానని... ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో సమావేశమవుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. హైదరాబాదులోని పార్క్ హయాత్ హోటల్ లో ఆయన మాట్లాడుతూ, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితరాలన్నీ తాము పూర్తిచేసి స్టీరింగ్ కమిటీకి విన్నవిస్తామని తెలిపారు. ఆ తరువాత తతంగమంతా స్టీరింగ్ కమిటీ చూసుకుంటుందని డిగ్గీరాజా స్పష్టం చేశారు. నెలాఖరుకల్లా ఎన్నికల జాబితాను సిద్ధం చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News