: మావోయిస్టుల టార్గెట్ లో మాజీ మంత్రి బాలరాజు
ఛత్తీస్ గఢ్ లో రెండ్రోజుల క్రితం 16 మంది భద్రతాదళాలను హతమార్చిన మావోయిస్టులు... మరింత విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా, ఒరిస్సా బోర్డర్ లో కూడా పంజా విసిరేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్రాంతంలో ఎప్పట్నుంచో బలంగా ఉన్న మావోలు... ఇప్పటికే తొమ్మిది యాక్షన్ టీంలను ఏర్పాటు చేసుకున్నారు. మావోయిస్టుల టార్గెట్ లో మాజీ మంత్రి బాలరాజు సహా మరో 18 మంది ఉన్నారు. ఈ వివరాలను విశాఖ ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో, అలజడి సృష్టించేందుకు మావోలు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. దీంతో, విశాఖ ఏజన్సీని అలర్ట్ చేశామని తెలిపారు.