: షారూక్, కత్రినాలతో చిందేయనున్న పిట్ బుల్


ఇంటర్నేషనల్ ర్యాప్ స్టార్ పిట్ బుల్ భారత్ లో అభిమానులను అలరించనున్నాడు. ఐపీఎల్ ఆరవ సీజన్ ప్రారంభోత్సవంలో పిట్ బుల్.. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, అందాల సుందరి కత్రీనా కైఫ్ లతో వేదికను పంచుకుంటాడు. ఐపీఎల్ తాజా సీజన్ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించే బాధ్యతను షారూక్ కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ఏప్రిల్ 2న కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాతి రోజు నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు షురూ అవుతాయి. కాగా, భారత్ లో ప్రదర్శన ఇచ్చేందుకు తనను ఆహ్వానించినట్టు పిట్ బుల్ ధ్రువీకరించినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News