: భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్ షేరు


దేశీయ రెండో ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ షేరు ధర ఈ రోజు స్టాక్ మార్కెట్లలో భారీ కుదుపునకు గురైంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు ధర 7 శాతానికి పైగా నష్టంతో రూ.3,409 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 261 రూపాయల నష్టం. ఉదయం ప్రారంభంలో 9 శాతానికి పైగా పడిపోగా కొద్దిగా రికవరీ అయింది. బీఎస్ఈలోనూ 7 శాతానికి పైగా నష్టంతో రూ.3,403 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14)లో మొత్తం మీద వృద్ధి తక్కువగా ఉంటుందని కంపెనీ నిన్న ప్రకటించడం షేరు ధరపై ప్రభావం చూపింది. వృద్ధి అంచనాలను చేరుకోలేమని ప్రకటించడం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. చివరి త్రైమాసికంతోపాటు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలను కంపెనీ ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.

  • Loading...

More Telugu News