: నా జీవితంలో తృప్తికి, అసంతృప్తికి పెద్దగా తేడా లేదు: జానారెడ్డి


ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలన్నింటినీ బలపరుస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పారు. పీసీసీ విషయంలో అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను తాను తప్పుపట్టనని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని... రాజకీయాలు వద్దు అనుకున్నప్పుడు రిటైర్ అవుతానని అన్నారు. తన జీవితంలో తృప్తికి, అసంతృప్తికి పెద్దగా తేడా లేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన పొన్నాలకు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ తో భేటీ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకువచ్చానని చెప్పారు. ఆయన కూడా కొన్ని సూచనలు చేశారని తెలిపారు.

  • Loading...

More Telugu News