: రాహుల్ తో భేటీ అయిన జానారెడ్డి
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. పీసీసీ బరిలో చివరి వరకు ఉన్న జానాకు చివరకు మొండిచేయి చూపించి... ఆ పదవిలో పొన్నాలను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై జానా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలువురి దగ్గర జానా ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ తో సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు రావొచ్చని సమాచారం. వివరాలు తెలియాల్సి ఉంది.