: టీడీపీలోకి వెళ్లను: కొండా మురళి
తాను, తన భార్య కొండా సురేఖ టీడీపీలోకి వెళ్తున్నామనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని వైఎస్సార్సీపీ మాజీ నేత కొండా మురళి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వివిధ పార్టీలు ఆహ్వానించడం సహజమేనని తెలిపారు. తాము కాంగ్రెస్ లోనే ఉంటామని... టీడీపీలోకి వెళ్లే అవకాశం లేదని చెప్పారు. పరకాల నుంచే కొండా సురేఖ పోటీ చేస్తుందని తెలిపారు. త్వరలోనే దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కలుస్తామని స్పష్టం చేశారు.