: బొత్స ఒక లిక్కర్ డాన్: చంద్రబాబు
ఒక కుటుంబ పెద్దగా అందరి సమస్యలను తీరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే బాధ్యత టీడీపీది అని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సామాన్యుడు కడుపునిండా తినలేని పరిస్థితి నెలకొందని... నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని విమర్శించారు. దీపం పథకాన్ని కాంగ్రెస్ దొంగలు ఆర్పేశారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వేయి నుంచి రెండు వేల రూపాయల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. బొత్స ఒక లిక్కర్ డాన్ అని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి ఊరికొక అనకొండను తయారుచేసి వదులుతోందని విమర్శించారు.