: సంజూకి ఫేస్ బుక్ ద్వారా మద్దతు తెలిపిన మమతా బెనర్జీ


సినీ నటుడు సంజయ్ దత్ కు మద్దతు తెలుపుతున్న నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులు సంజయ్ కు క్షమాభిక్ష పెట్టాలని కోరారు. ఇప్పుడీ వరుసలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా చేరారు. సోమవారం తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా మమత స్పందిస్తూ.. 'గతంలో చేసిన ఓ పొరబాటుకి ఇప్పటికే సంజయ్ తీవ్రంగా బాధపడ్డాడు' అన్నారామె. ఆ బాధనుంచి కోలుకుని, తన సామర్ధ్యంతో కెరీర్ ను సరైన రీతిలో మలుచుకుని జీవిస్తున్నాడని మమత అన్నారు.

కాగా, సంజయ్ తండ్రి సునీల్ దత్ ను మమత ఈ సందర్భంగా స్మరించుకున్నారు. 'ఆయనే బతికి వుంటే సంజయ్ ఎలాంటి సమస్య ఎదుర్కోకుండా అన్ని ప్రయత్నాలు ఆయనే చేసేవారు. నా హృదయం కూడా అలాంటి భావాలనే ఆలోచిస్తుంది' అన్నారు. అయితే సంజయ్ ప్రశాంతంగా, శాంతియుతంగా జీవించాలని అందరూ ప్రార్ధించాలని ఈ సందర్భంగా బెంగాల్ సీఎం విజ్ఞప్తి చేశారు. మరోవైపు సంజయ్ దత్ కు మద్దతు పలికేందుకు శివసేన పార్టీ నిరాకరించింది. కోర్టు విధించిన శిక్షను అనుభవించాల్సిందేనంటోంది. అయితే, గతంలో 18 నెలలు జైల్లో ఉన్న సంజయ్ కు బెయిల్ వచ్చేందుకు శివసేన అధినేత దివంగత బాల్ థాకరే సహాయాన్నిఅందించడం ఇక్కడ గమనార్హం!

  • Loading...

More Telugu News