: చినబాబు, పెదబాబు అప్పుడు లేఖ ఇచ్చి ఇప్పుడు డ్రామాలాడుతున్నారు: కిరణ్
తాను సీఎం అయ్యాకే రాష్ట్రంలో ఏ లోటూ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని కిరణ్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం, రైల్ రోకోలు, నిరసనలు ఉన్నా రైతులకు, మహిళలకు లబ్ది చేకూరేలా కార్యక్రమాల్ని కొనసాగించామని తెలిపారు. ఇద్దరు బాబులు... చంద్రబాబు (పెదబాబు), జగన్ బాబు (చినబాబు)లు విభజన చేయాలని లేఖలు ఇచ్చారని... ఇప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అక్కడ పెద్దమ్మ సోనియా, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ లు విభజించారని మండిపడ్డారు. ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అధికార పార్టీ కాంగ్రెస్ తో ఎలా కుమ్మక్కు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది అత్యంత నీతిబాహ్యమైన చర్య అని కిరణ్ అన్నారు.