: ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారు?: కిరణ్
పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సభ్యులను వెళ్లగొట్టి, చేయి చేసుకుని బిల్లును ఆమోదించారని జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ అన్నారు. అసెంబ్లీ తిప్పి పంపిన బిల్లును పార్లమెంటులో ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. విభజనను వ్యతిరేకించే తాను ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. ఈ రోజు రాజమండ్రిలో జరిగిన పార్టీ తొలి సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ, వైఎస్సార్సీపీ విభజనకు సహకరించాయని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలని ఏ నివేదిక సిఫార్సు చేయలేదని తెలిపారు. ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజించారని ఆయన ప్రశ్నించారు.