: ప్రజా సమస్యలపై పోరాటానికే కొత్త పార్టీ: పితాని


రాజమండ్రిలో జరుగుతున్న జై సమైక్యాంధ్ర తొలి బహిరంగ సభలో ఆ పార్టీ నేత పితాని సత్యనారాయణ ఉద్వేగ ప్రసంగం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటానికే కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేశారని చెప్పారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కించపరిచినందుకు, రాష్ట్ర హక్కులను కాలరాసే విధానాన్ని ప్రశ్నించేందుకు కొత్త పార్టీ పుట్టుకొచ్చిందన్నారు. తెలుగు జాతి హక్కులను పరిరక్షించేందుకే తమ పార్టీ అని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News