: ప్రజల కోసం పదవి వదులుకున్న కిరణ్ : ఉండవల్లి


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో నిర్వహిస్తున్న ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తొలి బహిరంగసభలో ఉండవల్లి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా పార్లమెంటులో జరిగిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. బిల్లుకు సంబంధించి రాష్ట్ర శాసనసభ, పార్లమెంటులో జరిగిన ఘటనలను సభలో ఆయన ఉదహరించారు. తెలుగు తల్లి ఇంకా చనిపోలేదని... రాష్ట్ర విభజన ఆగిపోతుందని తెలిపారు. రాష్ట్ర విభజన కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి పంపిందని... అక్కడ విభజన ప్రక్రియ ఆగిపోతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News