: హైదరాబాదుకు చేరుకున్న ఉత్తమ్ కుమార్, పొన్నాలకు ఘనస్వాగతం
ఢిల్లీ నుంచి బయల్దేరిన పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం హైదరాబాదుకు చేరుకున్నారు. పీసీసీ పగ్గాలను చేపట్టిన అనంతరం హైదరాబాదులో అడుగుపెట్టిన వారికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ ప్రాంతానికి పీసీసీ అధ్యక్షులుగా పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు.