: టి20 కప్ కోసం ఆసీస్ జట్టు తహతహలాడుతోంది: వాట్సన్
వన్డే ప్రపంచ కప్ లోనూ, టెస్టు చాంపియన్ షిప్ చరిత్రలోనూ ఆస్ట్రేలియా జట్టు కొత్తగా సాధించాల్సిందేమీలేదు. కానీ, ఆ జట్టును ఇప్పటిదాకా ఊరిస్తున్నది ఒక్క టి20 వరల్డ్ కప్ టైటిల్ మాత్రమే. ఇప్పటివరకు నాలుగు టి20 వరల్డ్ కప్ టోర్నీల్లో బరిలో దిగినా అన్ని సార్లూ రిక్తహస్తాలతో వెనుదిరిగారు కంగారూలు. ఈసారి ఆ పరిస్థితి ఉండదంటున్నాడు ఆల్ రౌండర్ షేన్ వాట్సన్. కోచ్ డారెన్ లీమన్ పర్యవేక్షణలో కప్ సాధిస్తామని వాట్సన్ ధీమా వ్యక్తం చేశాడు. జట్టు ప్రతిభావంతులతో పరవళ్ళు తొక్కుతోందని అభిప్రాయపడ్డాడు. అన్ని జట్లలోకి తమదే సమతూకంతో ఉన్న జట్టని పేర్కొన్నాడు. పదో నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులే అని వివరించాడు. బౌలింగ్ లోనూ నాణ్యతకు కొదవలేదని, అన్ని పరిస్థితులకు తగిన వైవిధ్యం ఉందని తెలిపాడు.