: అన్ని పార్టీలు జగన్ నే టార్గెట్ చేస్తున్నాయి: కోనేరు
రాష్ట్రంలోని పార్టీలన్నీ వైఎస్సార్సీపీ అధినేత జగన్ నే టార్గెట్ చేస్తున్నాయని ఆ పార్టీ నేత కోనేరు ప్రసాద్ ఆరోపించారు. జగన్ ను విమర్శించడమే అన్ని పార్టీల అజెండాగా మారిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే విజయమని జోస్యం చెప్పారు. ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సత్తా ఒక్క జగన్ కు మాత్రమే ఉందని అన్నారు.