: మూడు అంచెల్లో ఐపీఎల్... షెడ్యూల్ ఖరారు


ఐపీఎల్-7 వేదికలపై అనిశ్చితి తొలగింది. కాసులవర్షం కురిపించే ఈ లీగ్ ను మూడు అంచెల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 1 వరకు టోర్నీ జరుగుతుంది. భారత్ లో ఎన్నికల దృష్ట్యా తొలి అంచెను ఏప్రిల్ 16 నుంచి యూఏఈలో నిర్వహిస్తారు. ఈ దశలో 16 మ్యాచ్ లు జరుపుతారు.

అనంతరం రెండో అంచె మే 1 నుంచి 12 వరకు బంగ్లాదేశ్ లోగానీ, భారత్ లోగానీ నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికలు మే 13తో ముగియనుండగా, ఆఖరి అంచె సహా ఫైనల్ ను మాత్రం కచ్చితంగా భారత్ లోనే నిర్వహిస్తారు. ఈ మేరకు బీసీసీఐ లీగ్ షెడ్యూల్ వివరాలను కేంద్ర హోం శాఖ అనుమతి కోసం పంపింది. తమ ప్రతిపాదనకు హోం శాఖ ఆమోదముద్ర వేస్తుందని బీసీసీఐ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News