: అంబరీష్ ఫ్యాన్స్ కు రమ్య క్షమాపణ


సినీ నటి, మాండ్య ఎంపీ రమ్య... ప్రముఖ కన్నడ సినీ నటుడు, కర్ణాటక మంత్రి అంబరీష్ అనుచరులకు క్షమాపణ చెప్పింది. తన తండ్రి వల్లే అంబరీష్ రాజకీయాల్లోకి వచ్చారని రమ్య వ్యాఖ్యానించినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంబరీష్ తనకు రాజకీయ గురువు అని... ఆయన గురించి తాను తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అంబరీష్ జేడీ(ఎస్)లో ఉన్నారని... ఆ పార్టీనుంచి ఆయన కాంగ్రెస్ లోకి రావడానికి తన తండ్రితో పాటు ఎస్.ఎం.కృష్ణ కృషి చేశారనే తాను అన్నానని చెప్పారు. తన తండ్రి వల్లే అంబరీష్ రాజకీయాల్లోకి వచ్చారని తాను అనలేదని తెలిపారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. ఏదేమైనప్పటికీ... తన వల్ల అంబరీష్ అభిమానుల మనసులు గాయపడి ఉంటే తనను క్షమించాలని కోరారు.

  • Loading...

More Telugu News