: దాడిని తీవ్రంగా ఖండించిన సీపీఎం


ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భీకర దాడిని సీపీఎం పొలిట్ బ్యూరో ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. నిన్న సుక్మా జిల్లాలో మావోయిస్టులు మాటు వేసి 15 మంది పోలీసులతోపాటు ఓ సాధారణ పౌరుడిని కూడా హతమార్చిన విషయం తెలిసిందే. భద్రతకు సంబంధించి అసమగ్రమైన విధానాల వల్లే ఈ ప్రాంతంలో మావోయిస్టులు తరచుగా దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలసి మావోయిస్టులకు చెక్ పెట్టడానికి పటిష్ఠమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పింది.

  • Loading...

More Telugu News