: అనంతతో కలసి పనిచేయలేను: గుర్నాథరెడ్డి
అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీలో పుట్టిన ముసలం ఇంకా శాంతించలేదు. అనంత వెంకట్రామిరెడ్డిని వైకాపాలోకి తీసుకోవడంలో... ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అలకపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే. దీంతో, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు గుర్నాథరెడ్డిని కలసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో, గుర్నాథరెడ్డి కొంత వరకు శాంతించినట్టు తెలుస్తోంది. తాను వైఎస్సార్పీపీని వీడనని... కాని, ఎట్టి పరిస్థితుల్లో అనంతతో కలసి పనిచేయనని స్పష్టం చేశారు. ఎవరి పని వారు చేసుకుంటామని తెలిపారు. గతంలో వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, తమ అనుచరులను తీవ్రంగా వేధించారని ఆవేదన వ్యక్తంచేశారు.