: హైకోర్టుకు బాంబు బెదిరింపు


రాష్ట్ర హైకోర్టులో బాంబు ఉన్నట్లు ఫోన్ కాల్ రావడంతో ఈరోజు (బుధవారం) కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టామని, అది ఏ నిమిషమైనా పేలుతుందని ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో కోర్టు ఉద్యోగులు హడలిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హైకోర్టులో అణువణువునూ పరిశీలించారు. బాంబు స్వ్కాడ్ ను రప్పించి తనిఖీలను చేపట్టారు. తనిఖీల అనంతరం ఎలాంటి బాంబు లేదని బాంబు స్వ్కాడ్ తేల్చింది. ఇదంతా ఆకతాయి చర్యేనని పోలీసులు తేల్చారు. ఈ ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News