: కూతురు పరీక్షల కోసం ఢిల్లీలోనే లోక్ సభ సీటు కావాలట!


రాజకీయాలను మన సంప్రదాయ పార్టీలు దిగజార్చిన సంగతి అందరికీ తెలుసు. కానీ, రాజకీయాలను మారుస్తామని, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేస్తామంటూ పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీలోనూ పెడధోరణులు పెరిగిపోతున్నాయి. ఈ పార్టీకి చెందిన మహిళా నేత షాజియా ఇల్మి ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఇల్మి ఖండించారు. తాను డిల్లీలోనే ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కారణమేమని అడిగితే, తన కూతురికి ఢిల్లీలో పరీక్షలు ప్రారంభమయ్యాయని చెప్పారు. పిల్లల పరీక్షల కోసం ప్రభుత్వ ఉద్యోగి తన పోస్టింగ్ మార్చమని కోరినట్లుగా.. ఇల్మి కూతురు పరీక్షల కోసం ఢిల్లీలో సీటు అడిగి కొత్త విధానానికి నాంది పలికారు.

  • Loading...

More Telugu News