: లంచం తీసుకుంటూ బుక్కయిన ఎస్సై
విశాఖ జిల్లా రాంబిల్లి ఎస్సై వి.కృష్ణారావు రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకునేందుకు గాను ఆటో సంఘాన్ని ఎస్సై రూ. 10 వేలు అడిగాడు. ఈ నేపథ్యంలో వారు గతంలో ఐదు వేలు ఇచ్చారు. మిగిలిన ఐదు వేల కోసం ఎస్సై వేధిస్తుండటంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి చేయగా ఎస్సైతో పాటు హెడ్ కానిస్టేబుల్ కూడా పట్టుబడ్డాడు.