: భారత్ భద్రతా వ్యవస్థ సామర్థ్యం అమోఘం: మాజీ ఐబీ చీఫ్


భారత భద్రతా వ్యవస్థ పటిష్ఠతపై మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అజిత్ దోవల్ ప్రశంసలు కురిపించారు. దేశ భద్రతా వ్యవస్థకు చాలా సామర్థ్యం ఉందన్నారు. తాలిబన్లకు మద్దతు తెలుపుతూ.. దేశంలోకి తీవ్రవాదులను ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్ తో చర్చల విషయంలో భద్రతా వ్యవస్థ పనితనం అమోఘమన్నారు. 'చాలెంజెస్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజమ్' అనే అంశంపై మెల్ బోర్న్ లోని 'ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్' యూనివర్శిటీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన అజిత్, భారత్ భద్రతా వ్యవస్థకు ప్రతి విషయంపై ఎప్పటికప్పుడు అవగాహన ఉంటుందని పేర్కొన్నారు. అయితే, దేశంలో అమితమైన రాజకీయ ఆసక్తి వల్ల కొన్నిసార్లు చర్చలు సఫలమవుతున్నాయన్నారు. టెర్రరిజమ్, తిరుగుబాటును ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం వ్యూహాత్మక ఎత్తుగడలతో వ్యవహరించాలని సూచించారు.

  • Loading...

More Telugu News