: విమానం ఆచూకీ కోసం భారత్ సాయం కోరిన మలేసియా


గత శనివారం అదృశ్యమైన మలేసియన్ ఎయిర్ లైన్స్ విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మలేసియాతోపాటు అమెరికా, చైనా వంటి పలు దేశాలు విమానం ఆచూకీ కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకోవాలని మలేసియా అభ్యర్థించింది. దీనిపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, తమ వద్ద సరైన సమాచారంలేని కారణంగా గాలింపు ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు వియత్నాం పేర్కొంది. ఇక, ఆ విమానం మలక్కా జలసంధివైపు పయనిస్తుండగా తమ రాడార్లు సంకేతాలు అందుకున్నట్టు వచ్చిన వార్తలను మలేసియా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఖండించారు.

  • Loading...

More Telugu News