: జేసీ పేరెత్తడానికి కూడా ఇష్టపడను: పరిటాల సునీత


కొద్ది రోజుల్లో టీడీపీలో చేరబోతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. కనీసం జేసీ పేరు పలకడానికి కూడా తాను ఇష్టపడనని చెప్పారు. కాగా, రాప్తాడు, పెనుగొండ తమకు రెండు కళ్లులాంటివని, రెండు నియోజక వర్గాల్లోనూ తమ పాత్ర ఉంటుందని సునీత చెప్పారు. తమ అధినేత చంద్రబాబును సీఎం చేయడానికి ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. అనంతపురం జిల్లా ఘర్షణల నేపథ్యంలో జేసీ కుటుంబానికి, పరిటాల కుటుంబానికి ఎప్పటినుంచో పడదు. దాంతో, టీడీపీలోకి జేసీ రాకను సునీత తిరస్కరిస్తారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News