: సుబ్రతోరాయ్ ను విడుదల చేయాలంటూ కోర్టులో పిటిషన్


సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ ను విడుదల చేయాలంటూ ఆ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుబ్రతోను, ఇద్దరు డైరెక్టర్లను చట్టవిరుద్ధంగా కోర్టు నిర్బంధించిందని అందులో పేర్కొన్నారు. పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం ఈ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేపట్టనుంది. పలుమార్లు సమన్లు పంపినప్పటికీ సుప్రీం ఎదుట హాజరుకాకపోవడంతో కొన్ని రోజుల కిందట లక్నో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం సుబ్రతో తీహార్ జైల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News