: తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ గెలుపు ఖాయం: చంద్రబాబు
తెలంగాణ, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ భూ స్థాపితమైపోయిందని తెలిపారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని బాబు చెప్పారు. టీడీపీతోనే సీమాంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు.