: సెప్టెంబరులో సీమాంధ్రకు కొత్త రాజధానిని ప్రకటిస్తాం: జైరాం రమేశ్
సెప్టెంబరులో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ప్రకటిస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న జైరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. తాను తెలుగు ప్రజల ఏజెంటునని ఆయన చెప్పారు. అంతేకాని, టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తాను ఏ ప్రాంతానికీ ఏజెంటును కాదని ఆయన తేల్చి చెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన... కొంతమంది స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి, కొత్త పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు.