: బాలికపై లైంగిక వేధింపులు... వస్త్రాపహరణం


ముంబైలో కొందరు యువకులు 18 ఏళ్ల బాలిక పట్ల నీచంగా ప్రవర్తించారు. కాండీవలి ప్రాంతంలో మంగళవారం ఓ ఆటో డ్రైవర్, బాలిక మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో ఆటో డ్రైవర్, మరికొందరితో కలసి ఆమె చుట్టూ మూగి లైంగికంగా వేధించడంతోపాటు, బట్టలు ఊడదీసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ కానిస్టేబుల్, వాహనదారుడు ఆమెను కామాంధ మూక నుంచి రక్షించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు.

  • Loading...

More Telugu News