: ప్రచార కమిటీ అధ్యక్షులుగా చిరంజీవి, దామోదర రాజనరసింహ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా రెండు పీసీసీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పీసీసీ అధ్యక్షులతో పాటు, ప్రచార, మేనిఫెస్టో, ఎన్నికల కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. కాగా ప్రచార కమిటీ అధ్యక్షులుగా సీమాంధ్రకు కేంద్ర మంత్రి చిరంజీవి, తెలంగాణకు మాజీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నియమితులయ్యారు. ఇక ప్రచార కమిటీ సహాధ్యక్షులుగా సీమాంధ్రకు డొక్కా మాణిక్య వరప్రసాద్, తెలంగాణకు మహమ్మద్ షబ్బీర్ ఆలీ నియమితులయ్యారు. మేనిఫెస్టో కమిటీ అధ్యక్షులుగా సీమాంధ్రకు ఆనం రామనారాయణ రెడ్డి, తెలంగాణకు డి.శ్రీధర్ బాబు, సహాధ్యక్షులుగా పనబాక లక్ష్మి, మల్లు భట్టి విక్రమార్క నియమితులయ్యారు. 20 మంది సభ్యులతో సీమాంధ్రలో, 23 మంది సభ్యులతో తెలంగాణలో ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News