: రెండు రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులు బీసీలే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను నిన్న ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డిని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించింది. వీరిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే తెలంగాణకు మాత్రం ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ మేరకు నిన్న ఆదేశాలు జారీ చేశారు. రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యకు ఆమె స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.