: ఆర్టీసీ కార్మికులతో చర్చలు విఫలం
కార్మిక సంఘాలతో ఆర్టీసీ ఎండీ చర్చలు విఫలమయ్యాయి. రేపటి నుంచి ఇంటర్ పరీక్షల నేపథ్యంలో సమ్మె చేపట్టరాదని ఎండీ సూచించగా, ఐఆర్ ను అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. ఇరువర్గాలు పట్టు వీడకపోవడంతో చర్చలు నిష్ప్రయోజనంగా ముగిశాయి. తమ డిమాండ్లు అంగీకరించకపోతే రేపటి నుండి సమ్మెలో దిగుతామని ఈయూ, టీఎంయూలు ఈసరికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.