: వితంతువును వివాహమాడితే హనీమూన్ ఫ్రీ!


చత్తీస్ గఢ్ లో ఆపన్నుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ వినూత్నమైన ఆఫర్ ను ప్రకటించింది. వితంతువులను పెళ్ళాడే యువకులకు ఉచితంగా హనీమూన్ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. హనీమూన్ ప్యాకేజి పేరిట నాలుగు పగళ్ళు, మూడు రాత్రులు వారు సుప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ లలో గడపవచ్చని పేర్కొంది. ఇందుకుగాను 45 టూరిస్ట్ స్పాట్ లతో ఓ జాబితాను కూడా రూపొందించిందీ విలక్షణ ఎన్జీవో. హనీమూన్ ఖర్చులన్నింటిని తామే భరిస్తామని తెలిపింది.

కాగా, ఆ సంస్థ పేరు నేచుర్స్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ. ఈ ఎన్జీవో రాయ్ పూర్ నుంచి కార్యకలాపాలు సాగిస్తుంది. వైధవ్యం శాపం కారాదని, అందుకే తాము మహిళలకు మెరుగైన భవిష్యత్తు ఇచ్చేందుకు ఇలాంటి ఆఫర్ ప్రకటించామని ఎన్జీవో డైరక్టర్ డాక్టర్ వినీత తెలిపారు. ఇలాంటి కొన్ని వివాహాలను తాము మే2న అక్షయ తృతీయ పర్వదినం నాడు జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వినీత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News