: విమానం అదృశ్యం వెనుక ఉగ్రవాద హస్తం ఉండకపోవచ్చు: ఇంటర్ పోల్


మలేసియాలో విమానం ఆచూకీ లేకుండా పోవడం వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండకపోవచ్చని ఇంటర్ పోల్ అభిప్రాయపడింది. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇది ఉగ్రవాద చర్య అని భావించడంలేదని ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ రొనాల్డ్ నోబుల్ తెలిపారు. ఫ్రాన్స్ లోని లియోన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నకిలీ పాస్ పోర్టులతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాద చర్య అనుమానాలకు కారణమయ్యారని నోబుల్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము మరింత లోతుగా పరిశోధిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు.

227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయల్దేరిన విమానం కొద్ది గంటలకే రాడార్లకు అందకుండా పోయింది. ఇది వియత్నాం సముద్రంలో కూలిపోయి ఉంటుందని తొలుత భావించారు. కానీ, తీవ్రంగా గాలింపు చేపట్టినా శకలాలు లభ్యంకాలేదు.

  • Loading...

More Telugu News