: సీమాంధ్ర ప్రాంతానికీ న్యాయం చేస్తాం: రాజ్ నాథ్ సింగ్
తెలంగాణతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. బీజేపీ తెలంగాణ ఆవిర్భావ అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ పునర్నిర్మాణంపైనే బీజేపీ దృష్టి పెడుతుందని, దేశంలో సుపరిపాలన అందించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన వెల్లడించారు. తెలంగాణలో నక్సలిజం నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. గుజరాత్ లో అభివృద్ధిని సోనియా అధ్యక్షతన ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ప్రశంసించిందని ఆయన చెప్పారు.